News January 31, 2025

BHPL: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

image

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,563 మంది విద్యార్థులను గాను రూ.8,96,610 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Similar News

News October 21, 2025

వారితో అప్రమత్తంగా ఉండండి: ఏసీపీ దామోదర్

image

విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ప్రజలకు ముఖ్య సూచన చేశారు. పని మనుషులు, కేర్‌ టేకర్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలని కోరారు. ఇటీవల కన్సల్టెన్సీల ద్వారా వచ్చే సిబ్బంది నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అనుమానాలు ఉంటే తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు.

News October 21, 2025

బ్రేకప్‌పై రష్మిక ఏమన్నారంటే?

image

రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.

News October 21, 2025

దీపావళి విషెస్ చెప్పి చనిపోయిన నటుడు

image

బాలీవుడ్ హాస్య దిగ్గజం గోవర్ధన్ అస్రానీ నిన్న కన్నుమూసిన <<18059366>>విషయం<<>> తెలిసిందే. మ.3 గంటలకు ఆయన చనిపోయినట్లు మేనేజర్ బాబు భాయ్ చెప్పారు. అయితే అంతకు గంట ముందే అస్రానీ తన ఇన్‌స్టాలో ‘హ్యాపీ దీపావళి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతలోనే తమ అభిమాన నటుడు మరణించారని తెలియడంతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 1960ల్లో సినీ ప్రయాణం ప్రారంభించిన అస్రానీ 70ల్లో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. ఆయనకు భార్య మంజు ఉన్నారు.