News January 31, 2025
పొలం పనుల్లో రఘువీరారెడ్డి

మంత్రి, పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులైన రఘువీరారెడ్డి పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని తన పొలంలో రైతుగా మారారు. పంటలోని కలుపు మొక్కలను యంత్రంతో స్వయంగా తొలగించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయం దొరికినప్పుడు సామాన్యుడిలా జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సాగించారు.
Similar News
News March 1, 2026
మండపేట: క్షణికావేశంలో హత్య.. కటకటాలపాలైన అన్నదమ్ములు

మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులైన అన్నదమ్ములు అయినవిల్లి చంద్రపాల్, గిరిబాబు పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావును రాళ్లతో కొట్టి అతి దారుణంగా చంపారు. ఆవేశంలో చేసిన ఈ దాడితో సూర్య ప్రకాశరావు మృతి చెందగా, నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
కనువిందుగా భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News March 1, 2026
నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.


