News March 18, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.

Similar News

News April 21, 2025

శాతవాహనలో ఉర్దూ విభాగంలో ఆశ్రా తస్నీమ్‌కి పరిశోధక పట్టా

image

SUలో విశ్వవిద్యాలయ కళలు, సామాజికశాస్త్ర కళాశాలలోని ఉర్దూ విభాగంలో డాక్టరేట్ డిగ్రీని పరిశోధక విద్యార్థిని ఆశ్రా తస్నీమ్‌ కి అందజేశారు. “హైదరాబాద్ మే కాథూన్ షోరా అజాదీ కే బాద్ మే” అనే పరిశోధక అంశం తీసుకొని నజిముద్దిన్ మునావర్ పర్యవేక్షణలో పరిశోధన చేసి మౌఖిక పరీక్షలో నిరూపించించిన గ్రంథానికి డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేష్ కుమార్ తెలిపారు.

News April 21, 2025

కరీంనగర్: TGSRTCలో జాబ్స్‌.. ప్రిపరేషన్‌కు READY

image

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.

News April 20, 2025

కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

image

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.

error: Content is protected !!