News January 31, 2025
పార్వతీపురం: ఎస్పీగా బాధ్యతలు..24 గంటల్లోనే ఉద్యోగ విరమణ

పార్వతీపురం జిల్లా అదనపు ఎస్సీగా గురువారం ఎల్.నాగేశ్వరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె అమరావతి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా విధుల్లో చేరిన 24 గంటల్లో తాను విద్యాభ్యాసం ప్రారంభించిన పార్వతీపురంలో ఉద్యోగ విరమణ చేయనుండడం విశేషం
Similar News
News September 14, 2025
ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2025
BHPL: కారులో పాము.. తృటిలో తప్పిన ప్రమాదం

భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓ కారులో పాము కలకలం సృష్టించింది. కారు డోర్ తీసి చూడగా వింత శబ్దాలు రావడంతో యజమాని లోపల పామును చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా, అతడు వచ్చి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News September 14, 2025
కాల్ 1100ను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని SSS కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100కి కాల్ చేయవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.