News January 31, 2025

శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

image

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్‌ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 KV బల్క్‌ లోడ్‌ ఫీడర్‌ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌లోని కోదండాపూర్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.

Similar News

News January 13, 2026

వికారాబాద్: ‘రెబల్’ బెడద తప్పేనా?

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు ప్రధాన పార్టీలు వేట మొదలుపెట్టాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో రెబల్ అభ్యర్థుల బెడద లేకుండా ఉండేందుకు నాయకులు దృష్టి సారించారు. విజయ అవకాశాలు, సామాజిక సమీకరణాలు అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేసేందుకు అన్ని పార్టీల పెద్దలు పావులు కదుపుతున్నారు.

News January 13, 2026

కాకినాడ: రాజ్యసభ రేస్.. సానా సతీశ్‌కు మరో ఛాన్స్?

image

ఏపీలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల కోసం కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. జూన్‌లో పదవీకాలం ముగియనున్న ఒక స్థానాన్ని లోకేశ్ సన్నిహితుడు, సిట్టింగ్ సభ్యుడు సానా సతీశ్ బాబుకే కేటాయించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా రేసులో ఉండటంతో, అనుభవం వైపు మొగ్గు చూపుతారా లేక యువతకు ప్రాధాన్యమిస్తారా అన్నది CM చంద్రబాబు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. మరి మీ కామెంట్.!

News January 13, 2026

హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల ట్రాలీని లారీ ఢీకొట్టడంతో కూరగాయల వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హసన్‌పర్తికి చెందిన కూరగాయల వ్యాపారి శ్రీనివాస్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా ఎస్సై శీలం రవి పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు.