News January 31, 2025

OTTలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

image

టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’ ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఈ మూవీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.

Similar News

News January 10, 2026

48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్‌ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/

News January 10, 2026

సకల సంపదలు ప్రసాదించే సంపత్కరీ దేవి

image

లలితాదేవి గజ దళానికి అధిపతి అయిన సంపత్కరీ దేవి భక్తులకు ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించే కరుణామయి. అంకుశ స్వరూపిణి అయిన ఈ తల్లి, ఏనుగు అహంకారాన్ని అణచినట్లుగా మనలోని అజ్ఞానం, అహంకారాన్ని తొలగిస్తుంది. ఎంతటి పేదరికంలో ఉన్నవారికైనా సౌఖ్యాలను, విజయాలను చేకూర్చడం ఈ దేవి ప్రత్యేకత. కణ్వ మహర్షి బోధించిన ఈ దేవిని నిత్యం ప్రార్థిస్తే శత్రువులపై విజయం, అంతులేని ఐశ్వర్యం, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.

News January 10, 2026

అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

image

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.