News January 31, 2025

ఎలమంచిలి: చెక్ బౌన్స్ కేసులో డీటీకి జైలు శిక్ష

image

చెక్కు బౌన్స్ కేసులో ఎలమంచిలి డిప్యూటీ తహశీల్దార్ టీ.హనుమాన్ వినయ్ కుమార్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.9.05 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. 2019 నవంబర్ 14న టి.పద్మావతి దగ్గర డీటీ రూ.12 లక్షలు అప్పుగా తీసుకుని 2022న మార్చి 2న అప్పు తీర్మానం నిమిత్తం చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Similar News

News January 13, 2026

పిండివంటల కోసం ఈ చిట్కాలు

image

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.

News January 13, 2026

మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్‌లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.

News January 13, 2026

ఖమ్మం: సీపీఎం నేత హత్య.. వీరికి లై డిటెక్టర్ పరీక్ష

image

సీపీఎం నేత సామినేని హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో పోలీసులు ఆరుగురు నిందితులకు బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంగళవారం పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ జాబితాలో బోర్రా ప్రసాద్‌రావు, కంచుమర్తి రామకృష్ణ, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల వీరభద్రం ఉన్నారు. కొందరు అనుమానితులు పరీక్షకు నిరాకరించినట్లు సమాచారం.