News January 31, 2025

U19 WC: నేడు సెమీస్ పోరు.. భారత్ ఫైనల్‌కు వెళ్తుందా?

image

ఐసీసీ U19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. సెమీ ఫైనల్-1లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉ.8 గంటలకు ప్రారంభం అవుతుంది. సెమీ ఫైనల్-2లో ఇండియా, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ మ.12 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

Similar News

News December 28, 2025

త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!

image

విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్‌ఛేంజ్‌లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమీక్షిస్తోంది. 2026లో అమలులోకి వస్తున్న మార్కెట్ కప్లింగ్ విధానంతో అన్ని ఎక్స్‌ఛేంజీలు ఒకే రేట్ వసూలు చేయాలి. ప్రస్తుతం యూనిట్‌కు 2పైసలుగా ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజును 1.5/1.25పైసలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో డిస్కంలు తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తే సామాన్యులకు కరెంట్ బిల్ తగ్గుతుంది.

News December 28, 2025

గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

image

TG: జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.

News December 28, 2025

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఇండియన్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్స్ లిస్ట్‌లో స్మృతి మంధాన కంటే ముందు IND-మిథాలీ రాజ్(10,868), NZ-సుజీ బేట్స్(10,652), ENG-షార్లెట్(10,273) ఉన్నారు.