News January 31, 2025
BUDGET 2025: ఆర్థికసర్వేలో ఏముంటుందంటే..

బడ్జెట్ ముందురోజు పార్లమెంటులో ఆర్థికసర్వే ప్రవేశపెడతారు. దీనిని CEA రూపొందిస్తారు. గత ఏడాది దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని ఇందులో వివరిస్తారు. ఎకానమీ పరిస్థితి, వృద్ధిరేటు, ఇన్‌ఫ్లేషన్, ట్రేడ్ బ్యాలెన్స్, పరిశ్రమలపై సమీక్ష, ప్రభుత్వ ఆదాయం-ఖర్చులు, ద్రవ్యలోటు, పేదరికం, ఆరోగ్యం, విద్య, ఉపాధి గురించి వివరిస్తారు. వీటిని బట్టి వచ్చే ఏడాదికి పాలసీల రూపకల్పనకు సూచనలు ఉంటాయి. బడ్జెట్‌కు ఇదో ఇండికేషన్.
Similar News
News November 3, 2025
ఏపీ అప్డేట్స్

* ఈ నెల 20న తిరుమలకు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, 21న శ్రీవారి దర్శనం
* నేడు లండన్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
* కుల, చేతివృత్తిదారులకు ఎలాంటి పరికరాలు(ఆదరణ 3.0) అందించాలనే విషయమై మంత్రి సవిత అధ్యక్షతన నేటి నుంచి 3 రోజుల పాటు సమావేశాలు
* ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల డిమాండ్
News November 3, 2025
శుభ కార్యాలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

హిందూ ఆచారాల ప్రకారం.. శుభకార్యాల వేళ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. అయితే ఇది అలంకరణలో భాగమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. ‘పండుగలు, శుభ కార్యాల వేళ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటారు. వారి వల్ల కలుషితమైన గాలిని మామిడి ఆకులు శుద్ధి చేస్తాయి. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి చెట్టు కల్పవృక్షం’ అని అంటున్నారు.
News November 3, 2025
వేప మందుల వాడకంలో మెళకువలు

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.


