News January 31, 2025

చిన్నపిల్లలు, మహిళా సంరక్షణపై ఇలా త్రిపాఠి సమీక్ష

image

చిన్నపిల్లలు, మహిళల సంరక్షణ బాధ్యత పూర్తిగా మహిళ, శిశు సంక్షేమ శాఖతో పాటు జిల్లా యంత్రాంగంపై ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మహిళా శిశు సంరక్షణ, పాత అంగన్వాడి కేంద్రాల మరమ్మతులు, తదితర అంశాలపై ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు.

Similar News

News December 27, 2025

చెరువుగట్టుకు అదనంగా రూ.1.11 కోట్ల ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో మోహన్ బాబు శనివారం H-1, L-1 టెండర్ల వేలం నిర్వహించారు. తలనీలాలు సేకరించుకొను హక్కునకు బహిరంగ వేలం, సీల్డు టెండర్, ఇ-టెండర్ నిర్వహించగా మూడింటిలో కలిపి 20 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా రూ.2.50 కోట్లకు గాను KM.హెయిర్స్ ఇంటర్నేషనల్, తమిళవాడు వారిపేరిట టెండర్ ఖరారు చేశారు. గతేడాది కంటే రూ.1.11 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.

News December 27, 2025

జూన్‌ నాటికి ‘యంగ్ ఇండియా’ సిద్ధం కావాలి: కలెక్టర్

image

నల్గొండ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్న ఆమె, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జూన్ నుంచి ఈ పాఠశాలలో తరగతులు ప్రారంభించేలా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని అన్నారు.

News December 27, 2025

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీసు

image

నల్గొండ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించింది. నల్గొండ నుంచి ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ ఎంవీ రమణ శనివారం తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సు స్థానంలో డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.