News March 18, 2024
SVU: ఫలితాలు విడుదల

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో బీ ఫార్మసీ (B.Pharmacy) రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News September 25, 2025
చిత్తూరు: ఎన్నిరకాల గ్రానైట్ రాళ్లు లభ్యమవుతాయో తెలుసా!

చిత్తూరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరులో దాదాపు 400 క్వారీల్లో <<17827190>>గ్రానైట్ తవ్వకాలు<<>> సాగుతున్నాయి. చీటా బ్రౌన్, సి-గ్రీన్, మల్టీ రెడ్‌లతో పాటు అత్యంత ఖరీదైన బ్లాక్ గ్రానైట్ జీ-20 రకం జిల్లాలో లభ్యమవుతుంది. ఇక్కడ దొరికే గ్రానైట్ ఏపీలోనే కాకుండా సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. చిత్తూరు నుంచి చెన్నై, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగాతోపాటు బెంగళూరు, కేరళకు సైతం సరఫరాచేస్తారు.
News September 25, 2025
చిత్తూరు జిల్లా గ్రానైట్‌లో గోల్‌మాల్

చిత్తూరు జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరిట నడుస్తున్న బినామీ సంస్థ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా తప్పుడు బిల్లులు ఇస్తోందట. క్వారీల నుంచి లారీలకు నకిలీ బిల్లులు జారీచేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలు, దొంగ బిల్లుల వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అటు గ్రానైట్ లారీలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునేవారేలేరట.
News September 24, 2025
చిత్తూరులో యూనివర్సిటీ పెట్టండి: MLA

చిత్తూరు జిల్లా విభజనతో యూనివర్సిటీలు అన్ని తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయని MLA జగన్ మోహన్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. PVKN కాలేజీకి 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీ పెడితే విద్యార్థులకు బాగుంటుంది’ అని MLA కోరారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసే దిశగా కృషిచేస్తామని విద్యా శాఖ మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.