News January 31, 2025

విశాఖ: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీరప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్‌గా గుర్తించారు. ఒంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మహిళను హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 23, 2025

జగిత్యాల: NMMS పరీక్ష నిర్వహణపై అధికారుల సమీక్ష

image

జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతనాల ఎంపిక కోసం ఆదివారం NMMS పరీక్ష జరిగింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్ర సౌకర్యాలను తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని సూచించారు.

News November 23, 2025

JGTL: TRTF జిల్లా అధ్యక్షుడిగా సురేష్

image

TRTF జిల్లా అధ్యక్షుడిగా తుంగూరు సురేష్, ప్రధాన కార్యదర్శిగా గుర్రం శ్రీనివాస్‌గౌడ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ప్రకటించారు. జగిత్యాలలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీరితో పాటు 10 మంది రాష్ట్ర కౌన్సిలర్లు, 6 గురు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు,10మంది ఉపాధ్యకులు, 6గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, 10మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.

News November 23, 2025

GHMCకి ఇదే ఆఖరు.. ఏం జరుగుతుందో?

image

GHMC పాలక మండలి సమావేశం ఈ నెల 25న జరుగనుంది. పాలకమండలి గడువు త్వరలో ముగియనుండటంతో ఇదే చివరి సర్వసభ్య సమావేశం అని తెలుస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఏమేం అంశాలపై మాట్లాడాలో అజెండా తయారు చేసుకుంటున్నారు. ఈలలు, కేకల మధ్య సభ్యులందరితో ఫొటో సెషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే సభ్యులందరికీ సమాచారం అందింది. మరి సమావేశం వాడి.. వేడిగా జరుగుతుందా.. లేక ఆహ్లాద వాతావరణం నెలకొంటుందా అనేది చూడాలి.