News January 31, 2025
నేటి నుంచి అరకు ‘చలి’ ఉత్సవాలు ప్రారంభం

AP: అరకు లోయలో నేటి నుంచి చలి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. ఉత్సవాల కోసం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులు ముస్తాబు చేశారు. సాయంత్ర వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ మోటార్ గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. పర్యాటకం పెంపుదలే లక్ష్యంగా వీటిని రాష్ట్రం నిర్వహిస్తోంది.
Similar News
News February 27, 2025
తగ్గిన బంగారం ధరలు

కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.87,380కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,000గా ఉంది.
News February 27, 2025
ధనుష్-నాగార్జున ‘కుబేర’ రిలీజ్ డేట్ ఖరారు

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 20న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విధి ఆడే ఆటలో అధికారం, డబ్బు కోసం జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
News February 27, 2025
కుంభమేళాలో పాల్గొంటే బీజేపీకి దగ్గరయినట్టా?: డీకే

తాను బీజేపీకి దగ్గరవుతున్నానని వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్పష్టం చేశారు. ‘నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందువుగా పుట్టాను. హిందువుగానే జీవిస్తాను. హిందువుగానే మరణిస్తాను. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెబుతారా? కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది’ అని తెలిపారు.