News January 31, 2025
పిట్లం: పాము కాటుతో వృద్ధుడి మృతి..

పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు ఒర్రె మొగులయ్య (80) పాముకు కాటుకు గురై ప్రాణాలు వదిలారు. స్థానికుల వివరాలిలా..ఒర్రె మొగులయ్య బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అదే సమయంలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

పాడేరు,సంక్రాంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే రైతుల పండుగగా నిలుస్తుందన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపే పర్వదినమని పేర్కొన్నారు. ఈ పండుగతో ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి–సంక్షేమాల్లో జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు.
News January 14, 2026
WPLలోనే తొలి ప్లేయర్

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్‌గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
News January 14, 2026
జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి పార్థసారధి

జిల్లాలో రైతుల అవసరాలకు మించి యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పార్థసారధి తెలిపారు. మంగళవారం నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను సందర్శించి, రైతులు, అధికారులతో మాట్లాడారు. జిల్లాకు 10,073 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 12 వేల టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రైతులకు అధిక మొత్తంలో ఎరువులు అందజేస్తున్నామని మంత్రి వివరించారు.


