News January 31, 2025

విమాన ప్రమాదం PHOTOS

image

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన <<15306564>>ఫ్లైట్ యాక్సిడెంట్<<>> ఫొటోలను అధికారులు విడుదల చేశారు. రీగన్ విమానాశ్రయంలో బంబార్డియర్ CRJ-701 విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొట్టింది. దీంతో విమానం మూడు చోట్ల ముక్కలుగా విరిగిపోయి పోటోమాక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 64 మంది, హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రాణాలు వదిలారు.

Similar News

News February 28, 2025

చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 28

image

* జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం
* ప్రపంచ దర్జీల దినోత్సవం
* 1927- భారత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ జననం
* 1928- విద్యా, సామాజికవేత్త తుమ్మల వేణుగోపాల రావు జననం
* 1948- రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం
* 1963- భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)

News February 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 28, 2025

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఏటా ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం నాడు అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తులను గుర్తించి అవార్డులు ఇవ్వడం, సంక్షేమ శిబిరాలు నిర్వహించడం వంటివి చేయనుంది.

error: Content is protected !!