News January 31, 2025

CPRపై ప్రజల్లో అవగాహన నిర్వహించిన సీవీ ఆనంద్

image

మైత్రీ ఆసుపత్రుల సహకారంతో 16,000 మంది సిబ్బందితో హైదరాబాద్ సిటీ పోలీసులకు CPR శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అన్ని వయసుల వారిలోనూ ఆకస్మిక గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని అందువల్ల మనందరం కుటుంబ సభ్యుల అందరికీ సీపీఆర్‌పై అవగాహన అవసరమని తెలిపారు.

Similar News

News March 13, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్‌పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్‌పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 13, 2025

HYD: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

News March 13, 2025

HYD: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు: సీపీ

image

హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

error: Content is protected !!