News January 31, 2025

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

image

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణాధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 

Similar News

News March 1, 2026

నల్గొండ: రైతు భరోసా కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో యాసంగి సాగు పనులు చివరి దశకు చేరుకున్నా, పెట్టుబడి సాయం అందక 10.82 లక్షల మంది అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏటా నవంబర్‌లోనే విడుదల కావాల్సిన ‘రైతు భరోసా’ నిధులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో వరి, మిర్చి సాగుదారులు అప్పుల కోసం ఎదురుచూస్తున్నారు. సాగు కాలం ముగుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

News March 1, 2026

నల్గొండ: ఉచిత బ్యూటీషియన్ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ కోర్సుకు 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఆసక్తి గలవారు తమ విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా ప్రాంగణంలో సంప్రదించాలని మేనేజర్ అనిత తెలిపారు.

News March 1, 2026

NLG: సెగలు పుట్టిస్తున్న భానుడు

image

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. సాధారణంగా మార్చిలో ఉండే ఎండలు ఫిబ్రవరి చివరి వారంలోనే కనిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.