News January 31, 2025

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఎండు మిర్చి

image

TG: ఎండు మిర్చి ధరలు రోజురోజుకు పడిపోతుండటంతో పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో క్వింటాల్‌కు గరిష్ఠ ధర ₹23వేలు ఉండగా, ప్రస్తుతం ₹15వేలు కూడా దాటడం లేదని చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ వారం గరిష్ఠ ధర ₹14,800 పలికింది. తాజాగా ₹14,000కు తగ్గింది. నిన్న అత్యధిక కొనుగోళ్లు ₹11,000 నుంచి ₹13,000 మధ్యే జరిగాయని రైతులు తెలిపారు.

Similar News

News March 15, 2025

అప్పటివరకు రోహిత్ శర్మనే కెప్టెన్?

image

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ వరకు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతారని తెలుస్తోంది. ఆ తర్వాత కెప్టెన్సీ మార్పు ఉంటుందని బీసీసీఐ వర్గాల సమాచారం. దీనిపై బీసీసీఐ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని టాక్. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన BGTలో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. రోహిత్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-3 తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో కెప్టెన్‌ను మార్చాలని డిమాండ్లు వినిపించాయి.

News March 15, 2025

డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

image

US అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 41 దేశాలకు పైగా ప్రజలకు ప్రయాణ ఆంక్షలు విధించాలని ఆయన భావిస్తున్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. దాని ప్రకారం.. అఫ్ఘాన్, పాకిస్థాన్, భూటాన్, మయన్మార్ వంటి అనేక దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి ఆమోదం రాలేదని, జాబితాలో స్వల్ప మార్పులు ఉండొచ్చని శ్వేతసౌధ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది.

News March 15, 2025

పాక్‌కు బిగ్ షాక్: 214 సైనికుల్ని చంపేసిన BLA

image

పాకిస్థాన్‌కు చావుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. ‘యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48hrs గడువిచ్చాం. వారి జవాన్లను రక్షించుకొనేందుకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితుల్ని పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం. మా 12మంది అమర వీరులకు నివాళి అర్పిస్తున్నాం’ అని BLA ప్రకటించింది.

error: Content is protected !!