News January 31, 2025
త్వరలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచిన ‘Stranger Things’ వెబ్ సిరీస్ పార్ట్-5 షూటింగ్ పూర్తయినట్లు డైరెక్టర్స్ డఫెర్ బ్రదర్స్ వెల్లడించారు. 650 గంటల ఫుటేజ్‌ను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. యాక్షన్, ఎమోషనల్ అంశాలతో ఫైనల్ పార్ట్ ఉంటుందన్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్లు ప్రారంభించింది. కాగా వరల్డ్ వైడ్ అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌లలో ఇదొకటి.
Similar News
News February 28, 2025
చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 28

* జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం
* ప్రపంచ దర్జీల దినోత్సవం
* 1927- భారత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ జననం
* 1928- విద్యా, సామాజికవేత్త తుమ్మల వేణుగోపాల రావు జననం
* 1948- రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం
* 1963- భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)
News February 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 28, 2025
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఏటా ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దినోత్సవం నాడు అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వ్యక్తులను గుర్తించి అవార్డులు ఇవ్వడం, సంక్షేమ శిబిరాలు నిర్వహించడం వంటివి చేయనుంది.