News January 31, 2025

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చందనవెల్లిలో 11.4°C, చుక్కాపూర్ 12.1, రెడ్డి పల్లె 12, రాజేంద్రనగర్, తాళ్లపల్లి, కాసులాబాద్ 12.9, ఎలిమినేడు 13, రచలూరు, కొందుర్గ్ 13.1, అమీర్పేట, కేతిరెడ్డిపల్లి, మంగళపల్లె 13.2, కందవాడ 13.3, హెచ్సీయూ, విమానాశ్రయం 13.4, తొమ్మిదిరేకుల 13.5, వైట్‌గోల్డ్ SS 13.6, కడ్తాల్, వెల్జాల 13.7, దండుమైలారం 13.8, మద్గుల్ 13.9, అరుట్లలో 14℃గా నమోదైంది.

Similar News

News February 28, 2025

HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

image

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.

News February 27, 2025

పీఎంతో సీఎం HYD అభివృద్ధిపై చర్చ!

image

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
☞ నగరంలో మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాలి.
☞ మూసీ పునరుజ్జీవానికి కేంద్రం సాయం చేయాలి.
☞ RRRకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.
☞ మూసీ, గోదావరి అనుసంధాననికి రూ.2వేల కోట్లు కావాలి.

News February 27, 2025

HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

image

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.

error: Content is protected !!