News January 31, 2025

తణుకు: రాత్రంతా నిద్ర పోకుండా..!

image

తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.

Similar News

News March 12, 2026

ప.గో: డ్రోన్ల వినియోగం భేష్‌.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస

image

కలెక్టర్ల సమావేశంలో ప.గో కలెక్టర్ నాగరాణి పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. జిల్లాలో 45 డ్రోన్లను వ్యవసాయ సాగుతో పాటు, విద్యుత్తు లైన్ల నిర్మాణంలో పోల్ టు పోల్ వైర్లను అమర్చేందుకు ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. దీనివల్ల తక్కువ సమయంలో పనులు పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ వినూత్న ప్రయోగాన్ని గతంలో ఎన్నడూ వినలేదని పేర్కొంటూ సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

News March 12, 2026

భీమవరం: హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

image

ఈ నెల 16 నుంచి 28 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారి గిరిధర్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ సదుపాయం ఎంతో దోహదపడనుంది.

News March 12, 2026

రాష్ట్రంలోనే ప.గో. జిల్లాకు ఫస్ట్ ర్యాంకు

image

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసికానికి సంబంధించి IVRS ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 74.1 శాతం సానుకూలతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.