News January 31, 2025
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహక అధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 14, 2026
ప్రధాని మెచ్చిన కాకినాడ యువకుడి ఐడియా

కాకినాడ జిల్లా కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన యువకుడు కొరుప్రోలు శివ మణికంఠ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. ఈనెల 12న ఢిల్లీలో జరిగిన ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2026’లో ఆయన పాల్గొని, వ్యవసాయ రంగంలో తనకున్న వినూత్న ఆలోచనలను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించారు. శివ మణికంఠ టాప్-5 ఐడియా విభాగంలో నిలవడం విశేషం. ఈ యువకుడి ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News January 14, 2026
బుల్లెట్ బండిని గెలుచుకున్న గుంటూరు కోడి పుంజు

కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడిపందేలలో రాజధాని ప్రాంతం నుంచి తుళ్లూరుకి చెందిన కోడి పుంజు పందెంలో నెగ్గింది. దీంతో నిర్వాహకులు వారికి బుల్లెట్ బండిని బహుమతిగా అందజేశారు. బుల్లెట్ వాహనం ఖరీదు సుమారు రూ.2.50 లక్షల పైన ఉంటుందని చెబుతున్నారు. పందేలను వీక్షించేందుకు భారీగా జనం గుమిగూడారు.
News January 14, 2026
NRPT: సంక్రాంతి పండగ పూట విషాదం..

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నేతాజీ (36) దుర్మరణం చెందారు. మక్తల్ నుంచి రాయచూర్ వెళ్తున్న లారీ, అదే మార్గంలో వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నేతాజీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై నవీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పండుగ పూట ఈ ప్రమాదం విషాదం నింపింది.


