News January 31, 2025
గూడూరు: ‘సారీ.. చైతూ బావ’ అంటూ సూసైడ్

‘చైతూ బావ.. నా కోసం ఏదైనా చేస్తాను అన్నావుగా.. నీకు పుట్టే బిడ్డకు నా పేరు పెట్టు.. నాకు మీరు చూడగానే నచ్చారు. కానీ నా జ్ఞాపకాలు మీతో విడిచి వెళ్లిపోతున్నా.. సారీ..’ అని రాసి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిసెంబర్ 14న నిశ్చితార్థం కాగా..ఇవాళ బంధువుల అబ్బాయితో పెళ్లి జరగాల్సి ఉంది. ఏం జరిగిందో తెలియదు గానీ గూడూరు సమీపంలోని పంపలేరులో నిన్న మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 24, 2025
నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 24, 2025
ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.
News April 23, 2025
ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.