News January 31, 2025
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణ అధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
108 రైస్ మిల్లులు, 234 రైతు కేంద్రాలు సిద్ధం: జేసీ

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు మొత్తం 108 రైస్ మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాలు సిద్ధం చేశామని జేసీ అభిషేక్ గౌడ సోమవారం తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చేవారం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. జిల్లా లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను, ముందస్తుగా 85 లక్షల గోనె సంచులు సిద్ధం చేశామన్నారు. జీపీఎస్ డివైజ్ సిస్టంతో 3,803 వాహనాలను కూడా సిద్ధం చేసినట్లు జేసీ వివరించారు.
News November 4, 2025
మెడికల్ ఎగ్జామినేషన్‌లో ప్రైవసీ

BNS సెక్షన్ 53(2) ప్రకారం, క్రిమినల్ కేసుల వైద్యపరీక్షల సమయంలో ఒక మహిళను వైద్యురాలు లేదా ఆమె పర్యవేక్షణలో మాత్రమే పరీక్షించాలి. సెన్సిటివ్ మెడికల్ ప్రొసీజర్స్‌లో మహిళల కంఫర్ట్, కన్సెంట్, డిగ్నిటీ కాపాడేందుకు ఈ హక్కు కల్పించారు. అలాగే సెక్షన్ 179 ప్రకారం మహిళలను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. పోలీసులే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి.
News November 4, 2025
అరకు: అవును.. ఇది పాఠశాలే!

అరకులోయ మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ పరిధి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిధిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో 40 మంది విద్యార్థులకు నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనంలోనే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని గిరిజనులు సోమవారం తెలిపారు. పాలకులు స్పందించి సూకురుగుడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టాలన్నారు.


