News January 31, 2025
విశాఖ: కన్న కొడుకే హత్య చేశాడు

విశాఖలో శుక్రవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. <<15316724>>ఆల్కాసింగ్<<>> భర్త బదిలీ కావడంతో ఇటీవలే ముంబాయి నుంచి విశాఖ వచ్చారు. పెద్ద కొడుకు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించింది. దీంతో తల్లిని తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News January 4, 2026
భవిష్యత్తు అంతా పోరాట కాలం: సీఐటీయూ నేతలు

భవిష్యత్తంతా పోరాట కాలమని, ఐక్య ఉద్యమాలకు కార్మికవర్గం సిద్ధం కావాలని, ప్రధాని మోదీ జమానాలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని విశాఖలో సీఐటీయూ బహిరంగసభలో కార్మిక నేతలు అన్నారు. రాబోయే కాలమంతా పోరాటాలేనని, అందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న సమ్మెతో చరిత్ర సృష్టించాలన్నారు.
News January 4, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 4, 2026
రేపు విశాఖ పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశాఖ సిటీ పోలీస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తోంది. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు జనవరి 5న ఉదయం 10 గంటల నుంచి ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్‌లోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని సీపీ స్పష్టం చేశారు.


