News March 18, 2024
సోఫా, గాజు ముక్కలు, స్పాంజ్ తింటున్న బాలిక

UKకు చెందిన 3ఏళ్ల బాలిక వింటర్ ఆటిజంతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తోంది. సోఫా, గాజు ముక్కలు, ప్లాస్టిక్, స్పాంజ్, గోడల ప్లాస్టర్ వంటివి ఆహారంగా తింటోంది. నిద్రించే సమయంలో దుప్పటిని కూడా నమిలేస్తోందని.. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లు మొత్తం తినేస్తోందని తల్లి స్టేసీ తెలిపారు. ఎప్పుడూ తినకూడని వస్తువులు తినేందుకు తహతహలాడుతుంటుందని చెప్పారు. బాలికకు 13 నెలల వయసు నుంచి పైకా వ్యాధి ప్రారంభమైందని తెలిపారు.
Similar News
News July 6, 2025
రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
News July 6, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.