News January 31, 2025

KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

Similar News

News January 27, 2026

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ/స్పెషల్ బీఈడీ, బీపీఈడీ/డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. FEB 9 నుంచి 16 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని 9 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

News January 27, 2026

ఇసుక అక్రమ రవాణ నివారణకు ప్రత్యేక బృందాలు: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 73 కేసులు నమోదు చేసి, 113 మందిని అరెస్టు చేశారన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపిన 1,560 మంది పిల్లల తల్లిదండ్రులకు జరిమానా విధించి, కౌన్సిలింగ్ నిర్వహించారన్నారు. చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టామని వివరించారు.

News January 27, 2026

జనగామ: టీచర్ వినూత్న ఆలోచన.. డ్రెస్సులు పంపిణీ

image

సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేలా వారిని ప్రోత్సహించేందుకు ఓ టీచర్ వినూత్న ఆలోచన చేశారు. స్టే.ఘ.మం.శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.సురేందర్ రెడ్డి సంక్రాంతి సెలవులు ముగిసిన మరుసటి రోజే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు డ్రెస్సులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం రూ.14 వేల విలువైన డ్రస్సులను పంపిణీ చేశారు.