News January 31, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పెరిగి రూ.77,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 పెరగడంతో రూ.84,330 పలుకుతోంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Similar News
News July 4, 2025
ఇంగ్లండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్

INDతో రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (57*), స్మిత్ (57*) దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు (4, 6, 4, 4, 4) బాదారు. ఆ ఒక్క ఓవర్లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ENG స్కోర్ 169/5గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 6 ఓవర్లలోనే 43 రన్స్ సమర్పించుకున్నారు.
News July 4, 2025
పవన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుతో ఉపయోగమేంటి?

AP Dy.CM పవన్ మార్కాపురంలో రూ.1,290 కోట్లతో <<16937877>>తాగునీటి పథకానికి <<>>శంకుస్థాపన చేశారు. వెలిగొండ నుంచి నీటిని తీసుకుని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల తాగునీటి కష్టాలు తీర్చనున్నారు. ఇందులో భాగంగా ఒక వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5 వేల కి.మీ మేర పైపులైన్లు నిర్మిస్తారు. 18-20 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
News July 4, 2025
గ్రూపులు కడితే భయపడతామా?.. ఎమ్మెల్యేలపై ఖర్గే ఫైర్!

TG: పీఏసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ‘నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడతామని అనుకుంటున్నారా? ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్లను నేను, రాహుల్ పట్టించుకోం’ అని ఖర్గే మండిపడినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి, పదవులకు వన్నె తెచ్చే సమర్థులకు మాత్రమే వాటిని ఇవ్వాల్సిందిగా TPCCని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.