News January 31, 2025

WGL: రైతన్నకు నిరాశ.. తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఏరోజు ధర పెరుగుతుందో, ఏరోజు తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. గత వారం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,010పలకగా.. నేడు రూ.10 తగ్గి రూ.7 వేలకు చేరినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 7, 2025

వంగ, బెండలో కాపు దశలో చీడల నివారణ

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

News November 7, 2025

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు

image

ములుగు జిల్లాలో 245 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థులున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించారు. సర్వైకల్ క్యాన్సర్‌తో 27మంది, బోన్/లివర్ క్యాన్సర్‌తో 5మంది, బ్లడ్ క్యాన్సర్‌తో 9మంది, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 70మంది, ఓరల్ క్యాన్సర్‌తో 33మంది, గొంతు క్యాన్సర్‌తో 18మంది, ఇతర క్యాన్సర్ లక్షణాలతో 83మంది బాధపడుతున్నారు. ‘ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవం’.

News November 7, 2025

గోపాలపురం: కొడవలితో భార్యపై భర్త దాడి

image

భార్యపై అనుమానంతో భర్త కొడవలితో దాడి చేసిన ఘటన గోపాలపురం మండలం దొండపూడి మేదరపేటలో జరిగింది. ఎస్‌ఐ మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సింధూజపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త కాసాని రామకృష్ణ మద్యం మత్తులో వచ్చి దాడి చేశాడు. సింధూజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.