News January 31, 2025
భువనగిరి: ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

భువనగిరి జిల్లాలో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డిని జీహెచ్ఎంసీకి అటాచ్ చేశారు. ఆయన స్థానంలో బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ రామలింగం బదిలీపై రానున్నారు. నూతన కమిషనర్ విధుల్లో చేరేవరకు మున్సిపల్ డీఈ కొండల్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఆలేరు, పోచంపల్లి మున్సిపల్ కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు.
Similar News
News January 13, 2026
ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
News January 13, 2026
వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.
News January 13, 2026
విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.


