News January 31, 2025
HYD: గద్దర్‌కు ముఖ్యమంత్రి నివాళి

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆయన పేరుతో అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.
Similar News
News September 16, 2025
NGKL: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మల్లురవితో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. డిజిటల్ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆధునిక సాంకేతిక వనరులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని మల్లు రవి తెలిపారు.
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
News September 16, 2025
నడిగడ్డలో మట్టిలో కలుస్తున్న మానవ సంబంధాలు

నడిగడ్డలో మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యలు హతమారుస్తున్నారు. 3 నెలల క్రితం గద్వాలకు చెందిన తేజేశ్వర్‌ను అతడి భార్య ఐశ్వర్య పెళ్లైనా నెలకే కిరాతకంగా హత్య చేయించింది. ఆ సంఘటన మరువకముందే మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో పద్మ తన భర్త వెంకటేష్‌పై వేడి నూనె పోసి చావుకు కారణమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్లేషకులు అంటున్నారు.