News January 31, 2025
మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు

మేళ్లచెరువు జాతరకు నిధులు మంజూరయ్యాయి. శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 3, 2025
PDPL: బాయిలర్ పేలిన ఘటనలో గాయపడ్డ కూలీ మృతి

బాయిలర్ పేలి గాయపడ్డ రైస్ మిల్ కూలీ మృతి చెందాడు. సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం.. గత నెల 29న సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలోని కనకదుర్గ రైస్ మిల్ బాయిలర్ పేలింది. ఈ ఘటనలో సుల్తానాబాద్ కు చెందిన కూలీ గంగారపు కుమార్ (55) తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News November 3, 2025
HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.