News March 18, 2024

ఈ పులావ్.. వయాగ్రాతో సమానం!

image

ప్రపంచంలో ఎన్నో రకాల పులావ్స్ ఉన్నా ఉజ్బెకిస్థాన్‌ పులావ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది వయాగ్రాలా పని చేస్తుందట. ఆ దేశ జాతీయ వంటకం పులావ్. ఈవెంట్ ఏదైనా ఈ వంటకం ఉండాల్సిందే. దీన్ని యునెస్కో కూడా గుర్తించింది. ఇందులో పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే లక్షణాలున్నాయని, వయాగ్రాతో సమానమని ప్రజలు నమ్ముతారు. జీవితంలో ఒకే రోజు బతికి ఉంటామని తెలిస్తే వారు కచ్చితంగా పులావ్ తినాలని కోరుకుంటారట.

Similar News

News September 30, 2024

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికులకు ఆఫర్లు పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. అటు అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది. ఛార్జీలు నామ మాత్రంగానే ఉంటాయంది.

News September 30, 2024

ఎల్లుండి రజినీ ‘వేట్టయన్’ ట్రైలర్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ట్రైలర్ అక్టోబర్ 2న రానుంది. లైకా ప్రొడక్షన్స్ తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేసింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. మంజూ వారియర్ హీరోయిన్‌గా అలరించనున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

News September 30, 2024

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో విచారణపై స్టే విధించింది. ఈ కేసులో ఫిర్యాదుదారునిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గమనించామని, అలాగే కేసుని దోపిడీకి సంబంధించిన అంశంగా పరిగణించట్లేదని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసింది. అప్పటివరకు ఇన్వెస్టిగేషన్‌పై స్టే విధించింది.