News January 31, 2025
లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వే 2024-25ను ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓంబిర్లా రేపటికి వాయిదా వేశారు. శనివారం నిర్మల లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News February 28, 2025
రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్‌లు ఉన్నాయి.
News February 28, 2025
మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్

AP: రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా విశాఖలోని గీతం వర్సిటీలో MAR 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఇందులో IT, ITES రంగానికి చెందిన 49 కంపెనీల్లో యువతీయువకులకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 2024, 2025లో(Tech, Arts, Science, ITI, Polytechnics & Diploma) ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
News February 28, 2025
నేడు రాయలసీమకు వర్షసూచన

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2-3డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.