News January 31, 2025

HYD: గద్దర్ జయంతి.. సీఎం సందేశం

image

గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేక గొంతుక అని సీఎం రేవంత్ స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డు నెలకొల్పి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Similar News

News November 9, 2025

జూబ్లీ బైపోల్‌లో ఓటుకు రూ.2,500- రూ.5వేలు!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సా.5 గంటలకు ముగియనుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో చివరి రోజు పార్టీలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు, ఓటుకు రూ.2500- రూ.5వేల వరకు పంపిణీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల సంఘం కట్టడి చర్యలు చేపట్టింది. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నేటి సా.6 గం నుంచి పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయి.

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

image

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.