News January 31, 2025

విద్యార్థినిపై లైంగిక దాడి.. స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు

image

శ్రీకాకుళం నగరంలో గురువారం రాత్రి డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడిపై తక్షణమే విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి, డీఎస్పీ వివేకానందతో ఫోన్‌లో మాట్లాడి.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.

Similar News

News January 20, 2026

శ్రీకాకుళం: జిల్లాలో 57 ఉద్యోగాలకు నేడే లాస్ట్!

image

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11నే గడువు ముగియగా 20వ తేదీకి పెంచారు. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 20, 2026

పకడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షలు: SKLM కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, ఆరోగ్య శాఖల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా థియరీ పరీక్షలకు 39,383 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News January 20, 2026

SKLM: సరికొత్త అనుభూతి.. నేటి నుంచి హాట్ ఎయిర్ బెలూన్ సందడి

image

రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈనెల 20న హాట్ ఎయిర్ బెలూన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం జిల్లాలోనే తొలిసారిగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని, దీనికి టికెట్ ధర రూ.1000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.