News January 31, 2025

సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: డీఈఓ

image

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ సూచించారు. ‘కలాం స్ఫూర్తి యాత్ర’ పేరిట చేపట్టిన ‘ఫ్లో బస్సు’ (ఫ్యూ చరిస్టికల్ ల్యాబ్ ఆన్ వీల్స్) శుక్రవారం మెదక్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోగా ఆయన ప్రారంభించారు. ఫ్లో బస్లో సాంకేతిక రంగానికి సంబంధించిన వీఆర్ జోన్, వెదర్ స్టేషన్, రోబోటిక్స్ జోన్, మేకర్ స్పేస్, ఏఆర్ జోన్, ఐఓటీ జోన్ ప్రదర్శించారు.

Similar News

News January 6, 2026

మెదక్: గుప్త నిధుల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

image

గుప్త నిధులు తీస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా.. కాట్రియాలలో గుప్త నిధుల పేరుతో మోసానికి పాల్పడిన సిరిసిల్లకు చెందిన కందకంచి రాజారాం, కందకంచి రాజేష్, అశోక్‌లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

News January 5, 2026

మెదక్: 1978-94 వరకు చదివిన విద్యార్థులు ఒకే చోట

image

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1978 నుంచి 1994 వరకు విద్యాభ్యాసం చేసిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినుల సమ్మేళనం ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 350 మంది పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. సఖీ సంఘ్ పేరిట నిర్వహించిన పూర్వ విద్యార్థినుల సమ్మేళానాన్ని డి.మధుర స్మిత్, డాక్టర్ చల్లా గీత, సీహెచ్.శ్రీదేవీ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పొద్దార్ రేఖ పర్యవేక్షించారు.

News January 5, 2026

మెదక్: నేటి నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మండల తహశీల్, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ సోమవారం కలెక్టర్ స్వయంగా రేగోడ్ మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.