News January 31, 2025

గొంగడి త్రిష సూపర్ ఫామ్ కంటిన్యూ

image

భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష అండర్ -19 టీ20 ప్రపంచ్ కప్‌లో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతో రాణించి గెలుపులో కీలకంగా మారింది. కాగా ఇటీవల స్కాట్లాండ్‌తో జరిగిన టీ20ల్లోనే తొలి సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లోనూ ఉత్తమ క్రీడా ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Similar News

News November 13, 2025

HYD: చిన్న గొడవకే.. కత్తులు దూసుకుంటున్నారు!

image

చిన్నచిన్న కారణాలకే గొడవలు కత్తుల దాడులుగా మారిపోతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువగా యువతే పాల్గొంటుండటం మరింత ఆందోళనకరం. 2025 అక్టోబర్ నాటికి నగరంలో దాదాపు 60 హత్యలు జరిగినట్లు తేలింది. వీధి గొడవలు, గ్యాంగ్ సంస్కృతి, సోషల్ మీడియా ప్రేరేపణలు, సులభంగా ఆయుధాలు అందుబాటులోకి రావడం ఈ హింసకు కారణాలుగా తెలుస్తోంది.

News November 13, 2025

నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

image

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.

News November 13, 2025

కురుపాం ఘటన.. కేజీహెచ్‌లో NHRC విచారణ

image

కురుపాం గురుకులంలో జాండిస్‌ బారిన పడి బాలికలు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) బృందం గురువారం కేజీహెచ్‌‌లో విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వైద్య సేవల వివరాలు, పరీక్షల నివేదికలు, తీసుకున్న జాగ్రత్తలు బృందానికి వివరించారు. కాగా నిన్న కురుపాం పాఠశాలను ఈ బృందం సందర్శించింది.