News March 18, 2024
స్లీపర్ క్లాస్లో ఇదీ పరిస్థితి!
గత కొన్ని నెలలుగా భారతీయ రైల్వేలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనరల్ బోగీలను తగ్గించడంతో స్లీపర్ బోగీల్లో విపరీతమైన రద్దీ ఉంటోందని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనివల్ల స్లీపర్ బుక్ చేసుకుని, లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నిలబడేందుకూ ప్లేస్ ఉండట్లేదని, 3ACలోనూ అదే పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. వందేభారత్ లాంటి ప్రీమియర్ రైళ్లతో పాటు సామాన్యుల రైళ్లనూ పట్టించుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 15, 2024
దీపావళి విందులో మద్యం, మాంసం: క్షమాపణ చెప్పిన బ్రిటన్ ప్రధాని ఆఫీస్
దీపావళి వేడుకల్లో <<14574659>>మద్యం, మాంసం<<>> వడ్డించడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆఫీస్ క్షమాపణ చెప్పింది. పొరపాటు జరిగిందని మరోసారి ఇలా కాకుండా చూస్తామంది. కొన్నేళ్లుగా UK PM దీపావళి వేడుకలకు ఆతిథ్యమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ నృత్య ప్రదర్శనలు, దీపాలు వెలిగించడం, ఇతర కార్యక్రమాల తర్వాత వెజిటేరియన్ విందు ఉంటుంది. ఈసారి మద్యం, మాంసం వడ్డించడంతో విమర్శలొచ్చాయి. దీనిపై పీఎం ఆఫీస్ స్పందించింది.
News November 15, 2024
హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?
హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.
News November 15, 2024
ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి మోదీ
ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శుక్రవారం ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ముందుగా ఆయన ప్రయాణించాల్సిన విమానంలో <<14619050>>సాంకేతిక లోపం<<>> తలెత్తింది. దీంతో ఆయన దేవ్ఘర్ విమానాశ్రయంలో వేచిచూడాల్సి వచ్చింది. కొంత సమయం తరువాత కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరికి ఐఏఎఫ్ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. మోదీ విమానంలో సమస్య కారణంగా ఇతర విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఆలస్యమైంది.