News January 31, 2025
NZB: డిచ్పల్లి పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. సుద్ధపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాల్ పరిశీలించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్‌ను పరిశీలించారు. కూరగాయలు భద్రపర్చకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు.
Similar News
News November 11, 2025
ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.
News November 11, 2025
NZB: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 10 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు పంజాబ్‌లో జరిగే జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు.
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.


