News January 31, 2025
శ్రీసత్యసాయి: రీ సర్వే సందేహాలు నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు

శ్రీ సత్య సాయి జిల్లాలో భూముల రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న 32 గ్రామాలలో రైతులు సందేహాలు నివృత్తి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 9441688647 నంబర్‌ను సంప్రదించాలని సంయుక్త కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News September 15, 2025
యూరియాను పక్కదారి పట్టించిన గన్‌మెన్ నల్గొండకి అటాచ్..!

MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ నాగునాయక్ యూరియాను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఎస్పీ నాగు నాయక్‌ను నల్గొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News September 15, 2025
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్‌తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.
News September 15, 2025
జూరాలకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం ఉదయం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు వస్తుంది. స్పిల్ వే గేట్ల ద్వారా 32,235 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 41,513 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 74,344 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.