News January 31, 2025
సిద్దిపేట: అధికారులకు సీపీ సన్మానం

మానభంగం, పోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడడంలో కీలకపాత్ర వహించిన అధికారులను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఘనంగా సన్మానించి, అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. మానభంగం, ఫోక్సో కేసులో నేరస్థుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా నేరస్థుడికి జైలు శిక్ష పడడానికి కీలకపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీఐలు, సిబ్బందిని అభినందించారు.
Similar News
News November 17, 2025
జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్ వాయిదా

నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణను కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు వారిని 10 రోజుల కస్టడీకి కోరినట్లు సమాచారం. ప్రస్తుతం వారు నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
News November 17, 2025
MBNR: ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్‌లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
News November 17, 2025
సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్‌తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.


