News March 18, 2024

దర్శక ధీరుడికి 83 ఏళ్ల ఫ్యాన్ స్పెషల్ గిఫ్ట్

image

RRR సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళికి జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా జపాన్‌లో ఓ వృద్ధురాలు రాజమౌళి దంపతులకు ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్‌లో తెలియజేశారు. ‘రాజమౌళి గారు.. జపాన్‌కు స్వాగతం. నాకు 83 ఏళ్లు. నేను RRRతో డాన్స్ చేయాలని ప్రతిరోజు అనుకుంటున్నా’ అని బహుమతిపై ఆ ఫ్యాన్ పేర్కొన్నారు. తమకు ఇష్టమైన వారు ఆయురారోగ్యాలతో ఉండాలని జపాన్‌లో ఈ బహుమతులు ఇస్తుంటారు.

Similar News

News July 8, 2024

బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చురకలు

image

సందేశ్‌ఖాలీ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి చురకలంటించింది. ఆ ఘటనపై CBIతో దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు ‘ఒక వ్యక్తిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అని ప్రశ్నించింది.

News July 8, 2024

పేటీఎం షేర్లలో 9% వృద్ధి!

image

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పేటీఎంకు ఈరోజు ట్రేడింగ్‌లో సూచీలు ఊరటనిచ్చాయి. గరిష్ఠంగా 9.87% వృద్ధిని నమోదు చేసిన ఆ సంస్థ షేర్లు ప్రస్తుతం 8.11% ప్రాఫిట్‌తో ₹472 వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఆ సంస్థ షేర్లు ₹310-440 మధ్య కొనసాగుతున్నాయి. తాజాగా ₹36 వృద్ధి చెంది ₹500 మార్క్‌కు చేరువ అవుతుండటంతో ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2024

శ్మశానంలో సమాధులకు సినిమాలు

image

థాయ్‌లాండ్‌లోని ఓ శ్మశానవాటికలో సమాధుల వద్ద కుర్చీలు వేసి సినిమాలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. నఖోన్ రాట్చాసిమా ప్రావిన్స్‌లోని ఓ శ్మశానవాటికలో సినిమాలు వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. JUNE 2-6 మధ్య ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసమే ఈ ప్రయత్నమని వారు చెబుతున్నారు. అదే దేశంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయిన తన ప్రేయసిని వివాహం చేసుకోవడం గమనార్హం.