News January 31, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 11, 13, 15, 18వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

Similar News

News November 2, 2025

జనగామలో రేపటి ప్రజావాణి రద్దు

image

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా సర్వేలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News November 2, 2025

విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

image

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.

News November 2, 2025

వనపర్తి: నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేయండి

image

2025లో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. అదే విధంగా గతంలో నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు ఎంపికైన వారు రెన్యువల్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు https://scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.