News March 18, 2024

ముస్తాబాద్‌లో కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతి

image

కరెంట్ స్తంభం పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్లు, పొల్స్ విరిగిపడ్డాయి. ఎలుసాని ఎల్లయ్య (50) అనే వ్యక్తి కరెంట్ పోల్ పక్కనే ఉన్నాడు. భారీ ఈదురుగాలికి పోల్ విరిగి మెడపై పడింది. దీంతో అతని మెడపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News January 9, 2026

KNR: ‘ఉపాధి హామీకి కొత్త రూపం.. ‘వీబీ-జీ రామ్ జీ’గా బలోపేతం’

image

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.

News January 9, 2026

KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

image

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్‌లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News January 9, 2026

రామడుగు కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ

image

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.