News January 31, 2025
విజయనగరం: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పక‌్కడ్భంధీ ఏర్పాట్లు

ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు పక్కడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి అని ఆర్‌ఐ ఓ ఆదినారాయణ తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖలు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 2, 2025
ఎస్.కోటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

ఎస్.కోటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. CI నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకి చెందిన నాగభూషణం(58) ఎస్.కోట రైతు బజారు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
News March 2, 2025
VZM: ఇంటర్ పరీక్షలకు 702 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 702 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలలో 508 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 194మంది ఓకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరు కాకపోవడంతో గైర్హాజరు కాగా మరికొంతమంది వివిధ కారణాలతో హాజరు కాలేదు.
News March 2, 2025
విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.