News January 31, 2025
ఢిల్లీ ఎన్నికల ముందు ‘AAP’కు షాక్

మరో ఐదు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు MLAలు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, మదన్ లాల్, రోహిత్, బీఎస్ జూనే, పవన్ శర్మ, భావన గౌర్ ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Similar News
News September 13, 2025
మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కళ్లలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడించారు.
News September 13, 2025
జగన్ గోడ మీద పిల్లి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు: అనగాని

AP: అమరావతిపై YCP నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ‘రాజధాని విషయంలో 3ముక్కలాట ఆడిన జగన్‌ను ప్రజలు 11సీట్లకే పరిమితం చేశారు. రాజధాని నిర్మాణం అక్కర్లేదంటూనే GNT – VJA మధ్య <<17688305>>రాజధాని నిర్మిస్తామని<<>> చెబుతున్న YCP నేతల కబుర్లు నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజధానిపై జగన్ గోడ మీద పిల్లి వైఖరిని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
News September 13, 2025
ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు చేయడంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే’ ’ అని ఆమె తెలిపారు.