News January 31, 2025

KCRకు సీఎం రేవంత్ సవాల్

image

TG: ఫామ్‌హౌస్‌లో ఉండి KCR కథలు చెబుతున్నారని CM రేవంత్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మొగిలిగిద్ద సభలో సీఎం మాట్లాడారు. ‘KCR అసెంబ్లీకి వస్తే రుణమాఫీపై లెక్కలు చెబుతా. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. గుమ్మికింద పందికొక్కుల్లా మిగులుబడ్జెట్‌ను BRS నేతలు తినేశారు. అబద్ధాలు చెప్పడం వల్లే ఓడిపోయారు. KCR కాలం చెల్లిన రూ.వెయ్యి నోటు లాంటివారు. దానికి, ఆయనకు విలువలేదు’ అంటూ విమర్శించారు.

Similar News

News March 14, 2025

IPL-2025లో కెప్టెన్లు

image

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 14, 2025

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

image

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.

error: Content is protected !!