News January 31, 2025
ముమ్మిడివరంలో యువతి అదృశ్యంపై కేసు నమోదు

ముమ్మిడివరం మండలంలో యువతి అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదైంది. ఎస్సై డి.జ్వాలాసాగర్ వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ యువతి గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఆమె తిరిగి రాకపోవంతో యువతి తండ్రి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
CLAT-2026కు దరఖాస్తు చేశారా?

జాతీయ స్థాయిలో న్యాయవిద్య కోసం CLAT-2026కు దరఖాస్తులు కోరుతున్నారు. నేషనల్ లా యూనివర్సిటీల్లో UG, PG కోర్సుల్లో ప్రవేశాలకు OCT-31వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 4000, SC, ST, దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. DEC 7న పరీక్ష నిర్వహించనున్నారు. UG కోర్సులకు ఇంటర్, PG కోర్సులకు LLB డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.