News January 31, 2025
పార్వతీపురం: నిన్న ఛార్జ్.. నేడు రిటైర్..!

పార్వతీపురం అదనపు SPగా నిన్న ఛార్జ్ తీసుకున్న నాగేశ్వరి నేడు రిటైరయ్యారు. జిల్లాలో కేవలం 24 గంటలు మాత్రమే అదనపు ఏఎస్పీగా విధులు నిర్వహించారు. 1989లో తొలిసారి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆమె పదోన్నతులు పొందుతూ ASPస్థాయికి ఎదిగారు. తన తండ్రి పార్వతీపురంలోనే పోలీసు అధికారిగా పనిచేశారని.. దీంతో తన విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు చదువుకున్న చోట రిటైరవ్వడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News November 12, 2025
సివిల్స్ అభ్యర్థులకు త్వరలో రూ.లక్ష చొప్పున సాయం

TG: సివిల్స్ అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద లబ్ధి పొందిన వారిలో 43 మంది అభ్యర్థులు తాజాగా UPSC సివిల్స్ <<18265046>>ఫలితాల్లో<<>> ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. సింగరేణి CSR ప్రోగ్రామ్‌లో భాగంగా వీరికి CM రేవంత్ త్వరలో రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉచిత వసతి కల్పించడంతో పాటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
News November 12, 2025
HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

గాంధీభవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
News November 12, 2025
ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.


